చంద్రబాబు రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు: ఏపీ మంత్రి బొత్స
02-01-2020 Thu 14:45
- ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ను అప్పుల పాలు చేశారు
- ఏపీ విభజనకు టీడీపీ అనుకూలమని చెప్పింది నిజం కాదా?
- ఒక టౌన్ షిప్ కడితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందవు

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి క్రమంగా క్షీణించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజనకు తెలుగుదేశం అనుకూలమని చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
విశాఖలో బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విభజన తర్వాత ఒక సీనియర్ ను, అనుభవమున్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ప్రజలను చంద్రబాబు అడిగారు. దాంతో ప్రజలు ఆయనకు అవకాశమిచ్చారు. ఒక టౌన్ షిప్ కడితే సంపద వస్తుందా? ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరిగితే పెరిగి ఉండొచ్చు. కానీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయా?’ అని ప్రశ్నించారు.
More Latest News
ధనుశ్ కోసం కొనసాగుతున్న కథల వేట!
11 hours ago

కామన్వెల్త్ క్రీడల్లో రజతంతో సరిపెట్టుకున్న భారత హాకీ జట్టు... ఆసీస్ తో ఫైనల్లో ఘోర పరాజయం
11 hours ago
