మోహన్ బాబును హత్తుకుని, ముద్దు పెట్టుకున్న చిరంజీవి
Advertisement
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం వాడివేడిగా కొనసాగింది. అసోసియేషన్ లోని లుకలుకలపై రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు వేడి పుట్టించాయి. ఆయన వ్యాఖ్యలను చిరంజీవి తప్పుబట్టారు. అనంతరం మోహన్ బాబు ప్రసంగిస్తుండగా అక్కడ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

చిరంజీవి కనిపిస్తే ఏదో అనాలని తాను అనుకుంటానని... తాను కనిపిస్తే ఏదో అనాలని చిరంజీవి అనుకుంటారని... ఇదంతా సరదాలో భాగమేనని చెప్పారు. ఆయన కుటుంబం, తన కుటుంబం వేర్వేరు కాదని అన్నారు. దీనికి స్పందించిన చిరంజీవి వెంటనే లేచి మోహన్ బాబును ఆప్యాయంగా హత్తుకున్నారు. అనంతరం మోహన్ బాబు బుగ్గపై ముద్దు పెట్టారు. దీంతో, కార్యక్రమం జరుగుతున్న ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.
Thu, Jan 02, 2020, 01:30 PM
Advertisement
2020-02-28T16:29:08+05:30
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View