ఆ అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది.. రాష్ట్ర అసెంబ్లీలకు లేదు: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
01-01-2020 Wed 12:03
- సీఏఏను వెనక్కి తీసుకోవాలని కేరళ అసెంబ్లీ తీర్మానం
- ఇది ఆరెస్సెస్ అజెండాలో భాగమన్న విజయన్
- న్యాయ సలహా తీసుకోవాలని విజయన్ కు రవిశంకర్ ప్రసాద్ సూచన

పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, పౌరసత్వానికి సంబంధించి చట్టాలు చేసే ఎలాంటి అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు లేదని స్పష్టం చేశారు. కేవలం పార్లమెంటుకు మాత్రమే దీనిపై చట్టాలు చేసే అధికారం ఉందని అన్నారు. ఈ విషయంపై న్యాయ సలహాను తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు సూచించారు.
సీఏఏకు సంబంధించి కేరళ అసెంబ్లీ ఒక రోజు ప్రత్యేకంగా సమావేశమైంది. చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించడానికి ముందు సభలో విజయన్ మాట్లాడుతూ... ఆరెస్సెస్ పై విమర్శలు గుప్పించారు. పౌరసత్వ చట్టం ఆరెస్సెస్ అజెండాలో భాగమని అన్నారు. ముస్లింలను అంతర్గత శత్రువులుగా ఆరెస్సెస్ భావిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆరెస్సెస్ నియంత్రిస్తోందని తెలిపారు.
More Latest News
తెలంగాణలో తాజాగా 435 మందికి కరోనా పాజిటివ్
46 minutes ago

బాయ్ కాట్ ట్రెండ్ పై అర్జున్ కపూర్ వ్యాఖ్యలు... నీ పని నువ్వు చూస్కో అంటూ మధ్యప్రదేశ్ మంత్రి కౌంటర్
1 hour ago

టాలీవుడ్ వాళ్లు షూటింగులు ఆపేసి ఏం చేస్తున్నారని బాలీవుడ్ వాళ్లు ఆరా తీస్తున్నారు: దిల్ రాజు
3 hours ago

ఈ నెల 25న 'జిన్నా' టీజర్ రిలీజ్!
3 hours ago

మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు విఫలం
4 hours ago
