న్యూ ఇయర్ కానుకగా 'సామజ వర గమన' సాంగ్ ప్రోమో
Advertisement
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా 'అల వైకుంఠపురములో' చిత్రం రూపొందింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి 'సామజ వర గమన' పాట ప్రోమోను విడుదల చేశారు.

నాయకా నాయికలపై విదేశాల్లో ఈ పాటను చిత్రీకరించారు. అందమైన లొకేషన్స్ ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. అల్లు అర్జున్ లుక్ బాగుంది .. పూజ హెగ్డే మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. తమన్ సంగీతం .. సిరివెన్నెల సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాతో త్రివిక్రమ్ - అల్లు అర్జున్ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
Tue, Dec 31, 2019, 12:46 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View