హీరోయిన్ కాళ్లు మొక్కిన రామ్ గోపాల్ వర్మ.. భావోద్వేగానికి గురైన హీరోయిన్
Advertisement
వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ .. హీరోయిన్‌ నైనా గంగూలీ కాళ్లను మొక్కారు. వర్మ సమకూర్చిన కథతో 'బ్యూటిఫుల్' సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. ఈ సినిమా జనవరి 1న విడుదల కానున్న నేపథ్యంలో ఆ సినిమా బృందం నిన్న సాయంత్రం ప్రీ న్యూ ఇయర్‌ ప్రైవేటు పార్టీ చేసుకుంది.
 
సినీ బృందంలో కలిసి ఆర్జీవీ డ్యాన్సులు వేసి ఉత్సాహంగా గడిపారు. ఈ సినిమాలోని 'రా కసితీరా' అనే పాటకు హీరోయిన్‌ నైనాతో కలిసి ఆయన డ్యాన్స్‌ చేశారు. ఇందులో భాగంగా ఆయన హీరోయిన్‌ నైనా కాళ్లను మొక్కారు. దీంతో  ఆ హీరోయిన్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి.
Mon, Dec 30, 2019, 11:13 AM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View