వెండితెరపై సోలో రోల్ ఫుల్ లెన్త్ లో చేస్తాననుకోలేదు: ‘జబర్దస్త్’ సుడిగాలి సుధీర్
Advertisement
‘జబర్దస్త్’ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ చిత్రం నిన్న విడుదలైంది. ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో సుధీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెండితెరపై సోలో రోల్ ఫుల్ లెన్త్ లో చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని, ఒకవేళ అలా నటిస్తే తనను చూసేందుకు సినిమా టికెట్లు కొనుక్కుని ప్రేక్షకులు వస్తారని అనుకోలేదని అన్నాడు.

ఒకప్పుడు చిరంజీవి, పవన్ కల్యాణ్.. పెద్ద హీరోల సినిమాలు చూసేందుకు వెళ్లినప్పుడు పేపరు ముక్కలను థియేటర్ లో విసిరివేసేవాడినని, అలాంటిది, తాను నటించిన సినిమాను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఇదేవిధంగా చేయడం ఊహించలేకపోతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ చిత్రం సింగిల్ లైన్ మాత్రమే విన్నానని, ఆ తర్వాత కథ వింటానని దర్శకుడు రాజశేఖర్ రెడ్డికి చెప్పాను కానీ, ఏకంగా షూటింగ్ కే వెళ్లిపోయానని గుర్తుచేసుకున్నాడు. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి మంచి విజన్ డైరెక్టర్ అని, చాలా కూల్ గా ఉంటారని అన్నాడు.
Sun, Dec 29, 2019, 08:11 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View