'ఎవరికీ చెప్పొద్దు' అంటూ 'బుట్టబొమ్మా...' షూటింగ్ వీడియోను పోస్ట్ చేసిన పూజా హెగ్డే!
Advertisement
'బుట్టబొమ్మా పాట చిత్రీకరణకు సంబంధించిన స్పెషల్ వీడియో మీకోసం. ఎవరికీ చెప్పకండి' అంటూ హీరోయిన్ పూజా హెగ్డే, తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టడంతో అదిప్పుడు వైరల్ అయింది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'అల వైకుంఠపురములో..' చిత్రంలో పూజ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి అయింది. సినిమా వచ్చే నెల రెండో వారంలో సంక్రాంతి సందర్భంగా  వెండి తెరలను తాకనుంది. సినిమా విడుదలయ్యేంత వరకూ రోజుకో అప్ డేట్ ను ఇస్తామని, వాటిని చూస్తూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయవచ్చని చిత్ర యూనిట్ ప్రకటించింది.
Sun, Dec 29, 2019, 11:33 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View