ఆ సినిమా ఆత్రేయను ఆర్ధికంగా దెబ్బతీసిందట
Advertisement
సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ, ఆత్రేయ గురించిన ఒక విషయాన్ని ప్రస్తావించారు. "ఆత్రేయగారు 1400లకి పైగా సినిమాలకి పాటలు రాసినట్టు చెబుతారు. ఆ డబ్బంతా ఆయన ఏం చేసి ఉంటాడని అప్పట్లో ఆయన పరిస్థితిని చూసినవాళ్లు అనుకునేవారు. ఆయన ఎప్పటి డబ్బులు అప్పుడు ఖర్చు చేస్తూ ఉండేవారు.

అంతేకాదు అక్కినేని నాగేశ్వరరావు - కృష్ణకుమారి జంటగా 'వాగ్దానం' సినిమాను నిర్మించారు. తను మాటలు .. పాటలు రాయగలిగి కూడా ఇతర రచయితలతో మాటలు - పాటలు రాయించడం విశేషం. ఆ సినిమా నిడివి భారీగా పెరిగిపోవడంతో, ఆదుర్తి సుబ్బారావుగారిని ఆత్రేయ ఆశ్రయించారు. దాంతో ఆదుర్తి సుబ్బారావుగారు ట్రిమ్ చేశారు. అయినా ఈ సినిమా పరాజయం నుంచి తప్పించుకోలేకపోయింది. ఫలితంగా ఆత్రేయకి తీవ్రమైన నష్టాలు వచ్చాయి" అని చెప్పుకొచ్చారు.
Sat, Dec 28, 2019, 06:00 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View