అసిస్టెంట్ కోరికమేరకు నటుడిగా మారిన గౌతమ్ మీనన్
Advertisement
తమిళ .. తెలుగు భాషల్లో దర్శకుడిగా గౌతమ్ మీనన్ కి మంచి క్రేజ్ వుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలో సాగే కథలను తెరకెక్కించడంలో ఆయనకంటూ ప్రత్యేకత వుంది. అందువలన యూత్ ఆయన సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. దర్శకుడిగా ఎప్పుడూ కథలపై కసరత్తు చేస్తూ కనిపించే గౌతమ్ మీనన్ .. ఇప్పుడు నటుడిగా మారిపోయాడు.

గతంలో తన దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన మను ఆనంద్ కోసం గౌతమ్ మీనన్ నటుడిగా మారడం విశేషం. విష్ణు విశాల్ కథానాయకుడిగా మను ఆనంద్ 'ఎఫ్ ఐ ఆర్'  అనే ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేయవలసిందిగా మను ఆనంద్ కోరడంతో, గౌతమ్ మీనన్ అందుకు అంగీకరించాడని అంటున్నారు. నిన్నటి నుంచే ఆయన కాంబినేషన్లోని సన్నివేశాల చిత్రీకరణ మొదలైనట్టుగా చెబుతున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.
Sat, Dec 28, 2019, 02:52 PM
Advertisement
2020-02-28T16:29:08+05:30
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View