బాలీవుడ్ నిర్మాతపై మద్యం బాటిల్ విసిరిన హీరోయిన్ సంజన
Advertisement
హీరోయిన్ సంజన, బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ ల మధ్య జరిగిన ఒక గొడవ ఆలస్యంగా వెలుగు చూసింది. దీని ప్రకారం, బెంగళూరు రిచ్ మండ్ టౌన్ లో ఉన్న ఓ స్టార్ హోటల్ లో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా వందనపై సంజన మద్యం బాటిల్ విసిరినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కబ్బన్ పార్క్ పోలీసులకు వందన ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై సంజన మాట్లాడుతూ, వందనతో గొడవ జరిగిన మాట నిజమేనని... అయితే, అది చిన్నపాటి గొడవేనని చెప్పింది. గొడవకు సంబంధించి హోటల్ లో రాజీ చేసుకున్నామని తెలిపింది. అయితే, వందనా జైన్ కు రూ. 200 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని సంజన డిమాండ్ చేసింది. బెంగళూరులో వందనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, కానీ ఇక్కడ రూ. 200 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపించింది. ముంబైలో కూడా రూ. 20 కోట్ల విలువ చేసే బంగళా ఉందని చెప్పారు. ఆ బంగళా కూడా అక్రమమేనని చెప్పింది. ఇలాంటి వారు కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో విచారణ జరిపితే బయటపడుతుందని తెలిపింది.
Sat, Dec 28, 2019, 02:41 PM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View