ఆత్రేయను పరిచయం చేసింది ఆ దర్శకుడేనట!
Advertisement
తెలుగు పాటను తీయగా .. హాయిగా పరుగులు తీయించిన రచయితలలో ఆత్రేయ ఒకరు. మనసును తాకే ఎన్నో పాటలు రాయడం వలన ఆయనకి 'మనసు కవి' అనే బిరుదు దక్కింది. అలాంటి ఆత్రేయను గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ప్రస్తావించారు.

"ఆత్రేయ గారు సినిమాల్లోకి రాకమునుపు చిత్తూరులోని కలెక్టర్ ఆఫీసులో గుమస్తా ఉద్యోగం చేసేవారు. అలా అక్కడ పని చేస్తూనే నాటకాలు రాసేవారు. ఆయన రాసిన ఎన్నో నాటకాలు విజయవంతంగా ప్రదర్శింపబడ్డాయి. ఆత్రేయ శైలి నచ్చడంతో ఆయనను దర్శకుడు కేఎస్ ప్రకాశ్ రావుగారు ప్రోత్సహించారు. 1951లో 'దీక్ష' సినిమా ద్వారా ఆయన ఆత్రేయగారిని పరిచయం చేశారు. అప్పటి నుంచి పాటల రచయితగా ఆత్రేయగారు వెనుదిరిగి చూసుకోలేదు. ఆయనను ఎవరైనా 'మనసు కవి' అని పిలిస్తే ఆనందంతో పొంగిపోయేవారు" అని చెప్పుకొచ్చారు.
Sat, Dec 28, 2019, 01:29 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View