'భీష్మ' నుంచి ఆకట్టుకుంటోన్న సింగిల్
Advertisement
వెంకీ కుడుముల దర్శకత్వంలో .. సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో 'భీష్మ' రూపొందుతోంది. నితిన్ జోడీగా రష్మిక నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక సింగిల్ ను వదిలారు.

"హైక్లాస్ నుంచి లోక్లాస్ దాకా నా క్రష్ లే .. వందల్లో వున్నారులే.. ఒకళ్లూ సెట్టవ్వలే, కిస్సింగు కోసం .. హగ్గింగు కోసం .. వెయిటింగులే .. పాపెనుకే జాగింగులే .. " అంటూ ఈ పాట సాగుతోంది. మహతి స్వరసాగర్ బాణీ .. శ్రీమణి సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. యూత్ కి నచ్చేలా ఈ ట్యూన్ సాగింది. యూత్ కి నచ్చే ప్రేమకథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాపై నితిన్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఇక నితిన్ - రష్మిక జోడీ బాగా కుదిరిందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.
Fri, Dec 27, 2019, 05:11 PM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View