సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  
Advertisement
  *  ప్రస్తుతం 'ఫ్యామిలీ మేన్ 2' వెబ్ సీరీస్ లో నటిస్తున్న కథానాయిక సమంత తాజాగా ఓ చిత్రాన్ని అంగీకరించింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందే ఓ హారర్ థ్రిల్లర్ లో నటించడానికి సమంత ఓకే చెప్పినట్టు సమాచారం. అంతేకాదు, ఈ సినిమా తెలుగు వెర్షన్ కి ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తుందట.
*  'బాహుబలి' తర్వాత దర్శకుడు రాజమౌళి చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకు బిజినెస్ పరంగా చాలా క్రేజ్ ఏర్పడింది. ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రం పశ్చిమ గోదావరి జిల్లా హక్కులు 13 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.
*  గతంలో పలు తెలుగు చిత్రాలలో నటించిన కన్నడ భామ ప్రణీత ఇటీవల హిందీలో అజయ్ దేవగణ్ సరసన 'భుజ్' చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాకుండానే ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో మరో ఆఫర్ వచ్చింది. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందే 'హంగామా 2' చిత్రంలో ప్రణీత కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.
Fri, Dec 27, 2019, 07:16 AM
Advertisement
2020-02-28T16:29:08+05:30
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View