సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  ఇటీవల హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలోనే నటిస్తున్న కథానాయిక అనుష్క తాజాగా అలాంటిదే మరో సినిమాను అంగీకరించింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించే ఈ చిత్రం మిలటరీ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఇందులో అనుష్క ఫైట్స్ కూడా చేస్తుందట. వచ్చే నెలలో దీని షూటింగ్ మొదలవుతుంది.  
*  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలోని కొన్ని ముఖ్య పాత్రలకు కొంతమంది కొత్త ఆర్టిస్టులను తీసుకుంటున్నారట. ఈ క్రమంలో దర్శకుడు ఇప్పటికే కొందర్ని ఎంపిక చేసినట్టు సమాచారం.
*  ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత వరుస పరాజయాలతో వెనకపడిపోయిన శ్రీను వైట్ల మళ్లీ మరో సినిమా ఏర్పాట్లలో వున్నాడు. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడట.
Wed, Dec 25, 2019, 07:19 AM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View