మహేశ్ బాబు సినిమా కోసం విదేశీ సంగీత కళాకారులతో దేవిశ్రీప్రసాద్ కొత్త పాట... వీడియో ఇదిగో!
Advertisement
మహేశ్ బాబు, రష్మిక నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం టైటిల్ సాంగ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ సాంగ్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది. 'భగ భగ భగ మండే నిప్పుల వర్షమొచ్చినా... జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు' అంటూ సాగే  ఈ పాటను రాసింది దేవిశ్రీప్రసాదే. కాగా, ఈ టైటిల్ సాంగ్ కోసం దేవిశ్రీప్రసాద్ విదేశీ సంగీత వాద్యకారుల బృందంపై ఆధారపడ్డారు. ఇటీవల కాలంలో లైవ్ రికార్డింగ్ లు మరుగునపడిపోయి ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ తో పాటలు రికార్డు చేస్తున్న తరుణంలో, దేవిశ్రీ ఈ పాట కోసం పూర్తిగా లైవ్ రికార్డింగ్ నిర్వహించడం విశేషం. అనేక వాయిద్యాలపై కళాకారులు హృద్యంగా బాణీలు పలికిస్తుండగా, ఓ విదేశీ మ్యూజిక్ కండక్టర్ ఆధ్వర్యంలో దేవిశ్రీ ఈ పాటను రికార్డు చేశాడు. ఈ వీడియోలో ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది.

Mon, Dec 23, 2019, 07:56 PM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View