మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ గెలుపు ఖాయం: జగ్గారెడ్డి
23-12-2019 Mon 15:12
- ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది
- సింగూరు నీటి తరలింపుతో రెండు జిల్లాల ప్రజల కష్టాలకు గురవుతున్నారు
- నీటి సమస్యపై మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పాలి

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతోందని వస్తోన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ.. ఎన్నికలు ఎప్పుడు జరిపినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. సింగూర్ నీటి తరలింపుతో సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్ జిల్లా ప్రజలు నీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నీటి సమస్యపై మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై అలక్ష్యం తగదని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
More Latest News
3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి హోం గార్డును!... ట్విట్టర్ హ్యాండిల్లో కొత్త వాక్యాన్ని చేర్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి!
18 minutes ago

పోలీసులకు దొరకకూడదని టెడ్డీబేర్ లో దాక్కున్న దొంగ!
19 minutes ago

ఆ వీడియో మార్ఫింగ్ చేసినదే... గోరంట్ల మాధవ్ వీడియోపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్య
30 minutes ago

పొద్దున ఎనిమిదికి ముందు.. రాత్రి ఏడు తర్వాత కాల్స్ చేయొద్దు: లోన్ రికవరీ ఏజెంట్లకు రిజర్వు బ్యాంకు ఆదేశాలు
59 minutes ago

‘లాల్ సింగ్ చడ్డా’ను గుర్తించిన ఆస్కార్
2 hours ago
