ఇకపై అలాంటి పాత్రలు చేయనంటున్న పాయల్
Advertisement
తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో పాయల్ రాజ్ పుత్ ఒకరు. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో పాయల్ కుర్రకారు హృదయాలను దోచేసింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. అప్పటి నుంచి రొమాన్స్ ప్రధానంగా కలిగిన సినిమాల్లోనే పాయల్ కి అవకాశాలు వస్తున్నాయి. ఆ తరహా పాత్రలే ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.

అయితే రొమాన్స్ కి కాస్త దూరంగా ఆమె చేసిన 'వెంకీమామ' సినిమా ఆమెకి విజయాన్నిచ్చింది. నటనకి అవకాశం వున్న ఈ సినిమాలో పాత్ర ఆమెకి మంచి మార్కులను తెచ్చిపెట్టింది. దాంతో ఇకపై నటనకి ప్రాధాన్యత కలిగిన సినిమాలనే చేయాలనే నిర్ణయానికి ఆమె వచ్చినట్టుగా సమాచారం. పెద్ద హీరోల సరసన పాత్రలకే అధిక ప్రాధాన్యతను ఇవ్వాలనే ఉద్దేశంతోను ఆమె ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె చేస్తున్న 'డిస్కోరాజా' సెట్స్ పై వుంది.
Mon, Dec 23, 2019, 12:22 PM
Advertisement
2020-02-28T16:29:08+05:30
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View