క్రైమ్ థ్రిల్లర్ తో సెట్స్ పైకి యంగ్ హీరో
23-12-2019 Mon 11:22
- ఆది సాయికుమార్ పుట్టినరోజు ఈ రోజు
- క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తాజా చిత్రం
- ఆసక్తిని రేకెత్తిస్తోన్న పోస్టర్

ఆది సాయికుమార్ నటన పరంగాను .. డాన్స్, ఫైట్స్ పరంగాను మంచి మార్కులు తెచ్చుకున్నాడు. అయితే చెప్పుకోదగిన హిట్లు పడకపోవడంతో, ఆయన కెరియర్ బాగా నెమ్మదించింది. అయినా తనకి నచ్చిన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు.
అలా ఆయన ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందనుంది. ఈ రోజున ఆది సాయికుమార్ పుట్టినరోజు కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాకి సంబంధించిన ఒక కాన్సెప్ట్ పోస్టర్ ను వదిలారు. హీరో ఫేస్ షాడోపై దేవాలయం .. మసీదు .. చర్చ్ నేపథ్యంలోని దృశ్యాలతో రూపొందించిన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది .. ఆలోచింపజేస్తోంది. ఈ సినిమా ద్వారా శివశంకర్ దేవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ADVERTSIEMENT
More Telugu News
ఆసియా కప్ హాకీ: డ్రాగా ముగిసిన భారత్, పాకిస్థాన్ పోరు
36 minutes ago

రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు ఏకగ్రీవ ఎన్నిక
36 minutes ago

డయాఫ్రమ్ వాల్ కట్టడమంటే మీ ఇంట్లో మరుగు దొడ్డి కట్టడం కాదు: అంబటిపై అయ్యన్న విసుర్లు
54 minutes ago

'థ్యాంక్యూ' సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఖరారు!
2 hours ago
