రష్మిక గతంలో ఎలా ఉండేదో తెలుసు: కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ ప్రియుడు రక్షిత్!
Advertisement
గడచిన రెండేళ్ల వ్యవధిలో దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన రష్మికా మందన్నాతో తన బ్రేకప్ గురించి కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కొత్త చిత్రం 'అతడే శ్రీమన్నారాయణ' ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మీడియాతో మాట్లాడుతున్న వేళ, రష్మిక ప్రస్తావన వచ్చింది. ఆమెకు చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయని రక్షిత్ వ్యాఖ్యానించాడు.

ఆమె గతంలో ఎలా ఉండేదో తనకు తెలుసునని, కాబట్టి ఆ కలలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసునని అన్నాడు. ఆమె కన్న కలలు నిజం కావాలని మాత్రం కోరుకుంటున్నానని వ్యాఖ్యానించాడు. గతంలో 'కిరిక్ పార్టీ'లో రక్షిత్, రష్మిక కలిసి నటించగా, వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించిన సంగతి తెలిసిందే. ఆపై నిశ్చితార్థం కూడా వైభవంగా జరిగింది. 2018లో వీరిద్దరూ విడిపోయారు. రష్మిక వరుస విజయాలతో ప్రముఖ హీరోయిన్ గా ఎదిగింది.
Mon, Dec 23, 2019, 10:06 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View