'రొమాంటిక్' పాట రాసిన పూరి జగన్నాథ్
Advertisement
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా 'రొమాంటిక్' చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. కేతిక శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గతంలో తన దగ్గర శిష్యుడిగా పనిచేసిన అనిల్ పాదూరికి పూరి ఈ అవకాశాన్ని ఇచ్చాడు.

ఈ సినిమాకి కథ .. స్క్రీన్ ప్లే .. మాటలను కూడా పూరినే సమకూర్చాడు. అంతేకాదు ఈ సినిమా కోసం ఆయన ఒక రొమాంటిక్ సాంగ్ ను కూడా రాశాడు. నాయకా నాయికల కాంబినేషన్లో 'నువ్వు నేను ఈ క్షణం' అంటూ సాగే ఈ పాటను చిత్రీకరించారు. ఈ సాంగ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. రొమాంటిక్ సీన్స్ ను అద్భుతంగా తెరకెక్కించే పూరి, ఈ రొమాంటిక్ సాంగ్ ను ఏ రేంజ్ లో రాశాడో చూడాలి. ఈ రోజు సాయంత్రం ఈ పాటను విడుదల చేయవచ్చనే ఒక టాక్ వినిపిస్తోంది.
Sat, Dec 21, 2019, 12:08 PM
Advertisement
2020-02-28T16:29:08+05:30
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View