'ఆదిత్య 369' సీక్వెల్ కి దర్శకుడిగా బాలకృష్ణ!
Advertisement
బాలకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో .. ప్రయోగాత్మక చిత్రాల జాబితాలో ఒకటిగా 'ఆదిత్య 369' కనిపిస్తుంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇప్పటికీ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటుంది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ రూపొందనున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి 'ఆదిత్య 999' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా చెప్పుకున్నారు.

తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి బాలకృష్ణ స్పందించారు. 'ఆదిత్య 369'కి సీక్వెల్ చేయాలనీ నాకూ వుంది. ఒకరోజు రాత్రి అనుకోకుండా ఈ సీక్వెల్ కి సంబంధించిన కథ ఏమిటనేది తట్టింది. ఆ కథకు కార్యరూపాన్ని ఇవ్వవలసి వుంది. ఈ సినిమాకి నేనే దర్శకుడిగా వ్యవహరించే అవకాశం వుంది' అని ఆయన చెప్పుకొచ్చారు. సింగీతం శ్రీనివాసరావుకి వయసు పైబడటం వలన, తనే ఈ సినిమాను రూపొందించాలనే నిర్ణయానికి ఆయన వచ్చివుంటారేమో!
Sat, Dec 21, 2019, 10:52 AM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View