రవితేజతో కలిసి నటించాలని వుంది: సాయితేజ్
Advertisement
సాయిధరమ్ తేజ్ .. తన పేరును సాయితేజ్ గా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఆయన తాజా చిత్రంగా విడుదలైన 'ప్రతిరోజూ పండగే' సినిమా తొలిరోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అన్ని ప్రాంతాల్లోను తన సినిమాకి వస్తున్న టాక్ పట్ల తేజు ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు మల్టీ స్టారర్ చిత్రాలు ఎక్కువగా రూపొందుతుండటం గురించి స్పందించాడు.

తనకి రవితేజతో కలిసి నటించాలని ఉందనే మనసులోని మాటను బయటపెట్టాడు. తను ఎదురైనప్పుడల్లా, 'మనిద్దరం కలిసి ఒక సినిమా చేయాలబ్బాయ్' అని రవితేజ గారు అంటూ ఉంటారని తేజు చెప్పాడు. 'మంచి కథ కుదిరితే ఆయనతో చేయాలని నాకు కూడా చాలా ఆసక్తిగా వుంది' అని అన్నాడు. ఈ ఇద్దరికీ మాస్ ఇమేజ్ పుష్కలంగా వుంది .. ఎనర్జీ విషయంలో ఇద్దరూ ఇద్దరే. కనుక ఇది క్రేజీ కాంబినేషన్ అవుతుందనే చెప్పొచ్చు.
Sat, Dec 21, 2019, 10:26 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View