చరణ్ ఇచ్చిన సలహాను ఆచరణలో పెట్టిన ప్రభాస్
Advertisement
'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ ఈ పాటికే మొదలుకావలసింది. హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో భారీ సెట్స్ వేయడానికి సన్నాహాలు చేయడం మొదలుపెట్టారు.

అయితే స్టూడియోస్ లో కంటే ప్రైవేట్ స్థలంలో సెట్స్ వేయడం వలన ఖర్చు బాగా కలిసొస్తుందనీ, 'సైరా' ఖర్చును అలా తగ్గించుకున్నామని ప్రభాస్ తో చరణ్ చెప్పాడట. చరణ్ సలహాను ఆచరణలో పెట్టమని ప్రభాస్ చేసిన సూచన మేరకు నిర్మాతలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన 'తెల్లాపూర్' విలేజ్ సమీపంలో కొన్ని ఎకరాల స్ధలాన్ని లీజుకి తీసుకుని భారీ సెట్లు వేస్తున్నారట. ఈ పని పూర్తికాగానే షూటింగు ప్రారంభం కానున్నట్టు చెబుతున్నారు.
Sat, Dec 21, 2019, 10:02 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View