ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న ఎస్వీఆర్
Advertisement
తెలుగు తెర గర్వించదగిన నటులలో ఎస్వీఆర్ ఒకరు. ఆయన హావభావాల విన్యాసాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి ఎస్వీఆర్ గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ స్పందించారు. "ఎస్వీ రంగారావుగారు 'వరూధిని' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఆ తరువాత ఆయన చేసిన 'షావుకారు' మంచి పేరు తెచ్చిపెట్టింది.

'పాతాళ భైరవి' .. 'మాయాబజార్' సినిమాలు ఆయన విశ్వరూపానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఎస్వీ రంగారావు తిరుగులేని నటుడిగా ఎదుగుతూ ఉండగానే, ఆయన పారితోషికం పెరుగుతూ వచ్చింది. ఎన్టీఆర్ .. ఎస్వీఆర్ కంటే తన పారితోషికం ఎక్కువగా వుండాలని ఎస్వీఆర్ డిమాండ్ చేసేవారు. ఆయనకి గల క్రేజ్ కారణంగా అడిగిన మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు వెనకాడేవారు కాదు. అలా ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కంటే అధిక పారితోషికాన్ని ఎస్వీఆర్ అందుకున్న సందర్భాలు చాలానే వున్నాయి" అని చెప్పుకొచ్చారు.
Thu, Dec 19, 2019, 06:54 PM
Advertisement
2020-02-28T16:29:08+05:30
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View