సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
Advertisement
   *  గతంలో కొన్ని తెలుగు చిత్రాలలో కూడా నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ యామీ గౌతం తాజాగా అజిత్ సరసన ఛాన్స్ కొట్టేసింది. హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా రూపొందుతున్న 'వాలిమై' చిత్రంలో కథానాయికగా యామీగౌతం నటిస్తోంది.
*  మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం షూటింగ్ నిన్నటితో మొత్తం పూర్తయింది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. జనవరి 5న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తారు.
*  అల్లు అర్జున్ ఓపక్క 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని పూర్తిచేస్తూనే, మరోపక్క సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని మొదలెట్టిన సంగతి తెలిసిందే. ఇక సుకుమార్ చిత్రం తొలి షెడ్యూలు షూటింగ్ కూడా ముగిసినట్టు సమాచారం.
Thu, Dec 19, 2019, 07:06 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View