23 లక్షల్లో తీసిన 'ఖైదీ' .. కొన్ని కోట్లు వసూలు చేసింది: దర్శకుడు కోదండరామిరెడ్డి
Advertisement
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, 'ఖైదీ' సినిమాను గురించి ప్రస్తావించారు. 'అభిలాష' సినిమా హిట్ కావడంతో, ఆ తరువాత సినిమా తమకి చేసిపెట్టమంటూ మా నెల్లూరు నిర్మాతలంతా వచ్చారు. ఎలాంటి సబ్జెక్ట్ అయినా .. ఎంత ఖర్చు అయినా ఫరవాలేదన్నారు. దాంతో రకరకాల కథలను పరిశీలించాము.

చివరికి 'రాంబో' ఫస్టు బ్లడ్ సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నాము. ఆ సినిమాలోని రెండు మూడు సీన్లను తీసుకుని డెవలప్ చేద్దామని భావించాము. తర్జన భర్జనలుపడి ఫ్లాష్ బ్యాక్ ను ఓకే చేసుకున్నాము. చిరంజీవికి అనుకున్న గెటప్ బాగా సెట్ కావడంతో, మాకు ఆ కథపై నమ్మకం పెరుగుతూ వచ్చింది. పాటలు మినహా 30 రోజుల్లో షూటింగును పూర్తిచేశాము. మొత్తంగా 23 లక్షలు ఖర్చుకాగా కొన్ని కోట్ల రూపాయలను వసూలు చేసింది. దర్శకుడిగా ఈ సినిమా నా స్థాయిని పెంచింది" అని చెప్పుకొచ్చారు.
Tue, Dec 17, 2019, 02:45 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View