బాలకృష్ణ సినిమాకి బోయపాటి డివోషనల్ టచ్ ఇస్తున్నాడట!
Advertisement
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు మొదలవుతూనే ఉంటాయి. గతంలో వీళ్ల కాంబినేషన్లో వచ్చిన 'సింహా'.. 'లెజెండ్' చిత్రాలు ఘన విజయాలను అందుకోవడమే ఇందుకు కారణం. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు మళ్లీ మరో సినిమా చేయనుండటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సారి బాలకృష్ణ కోసం బోయపాటి ఎలాంటి కథను సిద్ధం చేసి ఉంటాడు? కథలో కొత్తదనం ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో బోయపాటి డివోషనల్ టచ్ కూడా ఇవ్వనున్నాడనేది తాజా సమాచారం. ఇంతవరకూ యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన బోయపాటి, ఈ సారి గ్రామీణ నేపథ్యంలో కథ అల్లుకుని, ఆ కథలో డివోషనల్ టచ్ ఉండేలా చూసుకున్నాడని అంటున్నారు. 70 కోట్ల బడ్జెట్ తో మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో, కథానాయిక ఎవరనేది త్వరలోనే వెల్లడించనున్నారు.
Tue, Dec 17, 2019, 12:55 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View