వివిధ భాషల్లో విడుదల తేదీలను ఖరారు చేసుకున్న 'శ్రీమన్నారాయణ'
Advertisement
కన్నడలో మంచి క్రేజ్ వున్న యువ కథానాయకులలో రక్షిత్ శెట్టి ఒకరు. ఆయన తాజా చిత్రంగా సచిన్ దర్శకత్వంలో 'అడ్వెంచర్స్ ఆఫ్ శ్రీమన్నారాయణ' రూపొందింది. పోలీస్ ఆఫీసర్ గా రక్షిత్ శెట్టి నటించిన ఈ సినిమాలో కథానాయికగా శాన్వి కనిపించనుంది. కన్నడతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఆయా భాషల్లో ఈ సినిమాను విడుదల చేసే తేదీలను తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. కన్నడలో ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన .. తెలుగులో జనవరి 1వ తేదీన .. తమిళ - మలయాళ భాషల్లో జనవరి 3వ తేదీన .. హిందీలో జనవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. పుష్కర మల్లికార్జునయ్య నిర్మించిన ఈ సినిమా, రక్షిత్ శెట్టికి ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Tue, Dec 17, 2019, 10:15 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View