ఈ సారి క్రైమ్ డ్రామాతో వస్తున్న 'అర్జున్ రెడ్డి' దర్శకుడు
Advertisement
తెలుగులో 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. దర్శకుడిగా 'సందీప్ రెడ్డి వంగ'కు ఈ సినిమా మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. దాంతో ఇదే సినిమాను ఆయన హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ కథ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

దాంతో ఆ చిత్ర నిర్మాతలు తమ తదుపరి సినిమాను కూడా సందీప్ రెడ్డితోనే నిర్మించాలనే నిర్ణయానికి వచ్చేశారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఒక కథను సందీప్ రెడ్డి వినిపించడంతో, వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ వంగ కూడా ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉండనున్నాడు. ప్రస్తుతం నటీనటులు .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు.
Tue, Dec 17, 2019, 09:33 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View