సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
Advertisement
  *  మళ్లీ దక్షిణాది చిత్రాలలో బిజీ కావాలని ప్రయత్నిస్తున్న కథానాయిక ఇలియానాకు అజిత్ సినిమా నుంచి ఆఫర్ వచ్చినట్టు సమాచారం. హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా రూపొందుతున్న 'వాలిమై' చిత్రంలో కథానాయిక పాత్రకు ఇలియానాను తీసుకుంటున్నారట.    
*  బాలకృష్ణ కథానాయకుడుగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన 'రూలర్' చిత్రం సెన్సార్ కార్యక్రమం పూర్తయింది. దీనికి సెన్సార్ U/A సర్టిఫికేట్ ను ఇచ్చింది. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు.
*  కొంత కాలం గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ ఇప్పుడు 'పింక్' రీమేక్ లో నటించనున్న సంగతి విదితమే. వేణు శ్రీరాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. కాగా, ఈ చిత్రానికి పవన్ 21  రోజులు కేటాయించినట్టు తెలుస్తోంది.  
Tue, Dec 17, 2019, 07:09 AM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View