ఢిల్లీలో శాంతి, భద్రతలు క్షీణిస్తున్నాయి.. అమిత్ షాను కలుస్తాను: కేజ్రీవాల్
Advertisement
పౌరసత్వ సవరణ చట్టంపై ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో విద్యార్థులు ఈ రోజు కూడా తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పెరిగిపోతోన్న ఉద్రిక్తతలపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు.

ఈ రోజు కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఢిల్లీలో శాంతి, భద్రతలు క్షీణిస్తున్న విషయంపై నేను చాలా ఆందోళన చెందుతున్నాను. నగరంలో వెంటనే తిరిగి శాంతియుత వాతావరణం తీసుకురావడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యేందుకు ఆయన అపాయింట్ మెంట్ కోరాను' అని కేజ్రీవాల్ తెలిపారు. 
Mon, Dec 16, 2019, 01:46 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View