సినిమా వాళ్లను తక్కువ చేసి మాట్లాడతారా?: విజయసాయిపై బుద్ధా వెంకన్న ఫైర్
Advertisement
జనసేన పార్టీ మాజీ నేత రాజు రవితేజ  చెప్పిన అంత:పుర రహస్యాలు అందరికీ తెలిసినవే అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. 'దత్త పుత్రుడు పవనిజం గ్రంథాన్ని రాశాడంటే ఎవరూ నమ్మలేదు. గోస్ట్ రైటర్ రాస్తే పేరు పెట్టుకోవడం సినిమా వాళ్లకు తెలిసిన విద్యే. స్పీచ్ లు, సోషల్ మీడియా కామెంట్లన్నీ బ్యాక్ గ్రౌండ్లో ఎవరో రాస్తున్న సంగతి తెలియనిదేమీ కాదు' అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న అభ్యంతరాలు తెలిపారు. సినీనటులను అవమానించారని అన్నారు.

'సినీ నటులను ఘోరంగా అవమానిస్తూ విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. గోస్ట్ రైటర్ రాస్తే పేరు పెట్టుకోవడం సినిమా వాళ్లకు తెలిసిన విద్యే అని తక్కువ చేసి మాట్లాడతారా? సినిమా రంగంలో ఉండే కష్టం మీలా ఉన్నట్టుండి అడ్డంగా ఎదిగిన వారికి ఏం తెలుస్తుంది సాయిరెడ్డి గారు? సినీ నటుల కష్టాన్ని, కళని అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి' అని బుద్ధా వెంకన్న ట్వీట్లు చేశారు. విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ కు సంబంధించిన ఫొటోను ఆయన పోస్ట్ చేశారు.
Mon, Dec 16, 2019, 12:42 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View