ఏపీ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విద్యార్థులు
ఏపీ అసెంబ్లీని ముట్టడించేందుకు రాయలసీమ విద్యార్థి సంఘాలు ఈ ఉదయం యత్నించాయి. దాదాపు 40 మంది విద్యార్థులు ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకువచ్చారు. శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని, రాయలసీమలో కృష్ణా బోర్డును, హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రెండో రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని నినదించారు. విద్యార్థులు ఒక్కసారిగా దూసుకురావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని అడ్డుకుని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.

Mon, Dec 16, 2019, 12:31 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View