విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్.. జనవరి 8న దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధం

దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. విద్యుత్ రంగ చట్టం -2003కు సవరణలు చేయడాన్ని నిరసిస్తూ ఒకరోజు సమ్మె చేపడుతున్నట్టు జాతీయ విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగుల సమన్వయ కమిటీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో 15 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అందువల్ల సమ్మె కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

 '2003 నాటి విద్యుత్ చట్టాన్ని సవరించడం వల్ల రైతులు, బలహీన వర్గాలు తీవ్రంగా ప్రభావితం అవుతారు. అందువల్ల తక్షణం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి' అని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ చైర్మన్ శైలేంద్ర దుబే కోరారు. అందువల్ల తమకు సంఘీభావంగా ఆయా రాష్ట్రాల్లోని విద్యుత్ రంగ ఉద్యోగులు కూడా విధులు బహిష్కరించాలని కోరారు. ప్రైవేటు సంస్థలకు లైసెన్స్ లను వీరు వ్యతిరేకిస్తున్నారు.

Mon, Dec 16, 2019, 11:52 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View