ఇళ్ల ముందున్న వాహనాలకు నిప్పు పెట్టిన ఆగంతుకులు.. గుంటూరు జిల్లా తాడికొండలో ఘటన

గుంటూరు జిల్లా తాడికొండలో ఓ ఇంటి ముందున్న వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఎవరు చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో? వెల్లడికాకపోయినా ఇటీవల కాలంలో గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్ల ముందున్న వాహనాలను తగులబెట్టి బాధితులకు భారీగా నష్టం కలిగిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండడం లేదు.

తాజాగా తాటికొండలో ఓ కారు, ఆటోకు నిప్పంటించారు. ఈ రోజు తెల్లవారు జామున మూడు గంటల సమయంలో దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. తగులబడిన వాహనాల్లో కారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా బంధువుదిగా గుర్తించారు. దీంతో ఈ ఘటనకు రాజకీయ కోణం ఏమైనా ఉందా? లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Mon, Dec 16, 2019, 11:38 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View