ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన కుట్రలో ఈయన ప్రధాన భాగస్వామి: విజయసాయి రెడ్డి
Advertisement
వైసీపీ ప్రభుత్వ చర్యలన్నీ ప్రజా వ్యతిరేకమే అని రుజువు చేశామంటూ నిన్న టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాము అడిగిన ప్రశ్నలకు వైసీపీ సూటిగా సమాధానం చెప్పలేకపోతోందని ఆయన మండిపడ్డారు. యనమల వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
యనమల గారు కూడా నీతి బోధలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన కుట్రలో ఈయన కూడా ప్రధాన భాగస్వామని ఆరోపించారు. 'అప్పటి పల్లకీ సేవకు తన బంధువులకు అనేక పదవులు, వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇప్పించుకున్నాడు. కులజ్యోతి రాసిన కడుపు మంట వార్తను పట్టుకుని పత్తిగింజ కబుర్లు చెబుతున్నాడు' అని విమర్శించారు.
Mon, Dec 16, 2019, 11:18 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View