విడుదల తేదీని ఖరారు చేసుకున్న 'తూటా'
Advertisement
కథలో కొత్తదనం .. పాత్రల్లో వైవిధ్యం ఉండేలా చూసుకునే తమిళ హీరోల్లో ధనుశ్ ఒకరు. విభిన్నమైన కథాకథనాలతో ఆయన నుంచి ఇటీవల వచ్చిన చిత్రమే 'ఎన్నై నొక్కి పాయుమ్ తోటా'. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా మేఘా ఆకాశ్ నటించింది. క్రితం నెల 29వ తేదీన తమిళంలో విడుదలైన ఈ సినిమా, వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.

అలాంటి ఈ సినిమాను 'తూటా' టైటిల్ తో అదే రోజున తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలైన తాతా రెడ్డి .. సత్యనారాయణ రెడ్డి భావించారుగానీ కుదరలేదు. ఈ నెల 27వ తేదీన ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ను విడుదల చేయాలని వాళ్లు నిర్ణయించారు. ఆ రోజున పోటీ లేకపోవడంతో ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తుందనే అభిప్రాయంతో వాళ్లు వున్నారు.
Mon, Dec 16, 2019, 10:16 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View