సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
  *  మణిరత్నం రూపొందిస్తున్న భారీ చిత్రం 'పొన్నియన్ సెల్వం' నుంచి అందాలతార కీర్తి సురేశ్ తప్పుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే ఛాన్స్ రావడంతో డేట్స్ సర్దుబాటు కాక మణిరత్నం చిత్రాన్ని ఈ చిన్నది వదులుకుందట.
*  గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందే చిత్రం రెగ్యులర్ షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తోంది. విశేషం ఏమిటంటే, ఇందులో హీరో హీరోయిన్లు ఇద్దరూ కబడ్డీ కోచ్ లుగా నటిస్తున్నారు.
*  శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందే తెలుగు చిత్రంలో కథానాయికగా నటిస్తున్న రీతువర్మ తాజాగా తమిళంలో ఓ పెద్ద అవకాశాన్ని అందుకుంది. విశాల్ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమె నాయికగా నటిస్తుంది. 
Mon, Dec 16, 2019, 07:24 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View