మహిళల కోసం 48 చట్టాలు ఉన్నాయి.. పురుషుల కోసం ఒక్క చట్టం కూడా లేదు: సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్
Advertisement
మన దేశంలో ప్రతి ఆరున్నర నిమిషాలకు ఒక మగవాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడని 'సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్' ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో భార్యా బాధితులు పెరిగిపోతున్నారని తెలిపింది. చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుంటూ పురుషులను మహిళలు వేధిస్తున్నారని చెప్పింది. మహిళల కోసం 48 చట్టాలు ఉన్నాయని... పురుషుల కోసం ఒక్క చట్టం కూడా లేదని వ్యాఖ్యానించింది. ఫౌండేషన్ అధ్యక్షుడు రాజేశ్ వకారియా మాట్లాడుతూ, మహిళా కమిషన్ ఉన్నట్టుగానే పురుషులకు కూడా ఓ కమిషన్ ఉండాలని డిమాండ్ చేశారు.

భర్తలు, వారి కుటుంబీకులపై భార్యలు, వారి కుటుంబీకులు 498 (ఏ)తో పాటు మరో 5 కేసులు పెడుతున్నారని ఫౌండేషన్ పేర్కొంది. వీటిని కూడా ఒక్క చోట కాకుండా వివిధ కోర్టులలో ఒక్కో కేసు చొప్పున పెడుతున్నారని, దీంతో, మగవాళ్లు, వారి కుటుంబ సభ్యులు కోర్టుల చుట్టూ తిరగలేక అల్లాడిపోతున్నారని చెప్పింది. 498 సెక్షన్ కేసు పూర్తిగా మహిళలకే అనుకూలంగా ఉందని తెలిపింది. కేసు తప్పుడు కేసు అని తెలిసినా... ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.
Sat, Dec 14, 2019, 02:59 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View