దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది: సోనియా గాంధీ
Advertisement
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 'భారత్ బచావో' ర్యాలీలో పాల్గొని ఆమె మాట్లాడారు.

'దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. దేశంలోని పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అధిక ధరలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేశాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పోరాటం చేయాలి' అని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.

'దేశంలోని యువతకు ఉద్యోగాలు రావట్లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు అందట్లేవు. పౌరసత్వ బిల్లు వల్ల భారతీయ ఆత్మ ముక్కలు ముక్కలు అవుతుందన్న విషయాన్ని మోదీ-షా ఏ మాత్రం పట్టించుకోవట్లేదు' అని సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు.
Sat, Dec 14, 2019, 01:50 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View