చేతివాటానికి పాల్పడుతూ సాక్షాత్తు మంత్రికే చిక్కిన పోలీసులు!

సాక్షాత్తు ఓ మంత్రి ఆశ్చర్యపోయే ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఇద్దరు కానిస్టేబుళ్లు వాహన చోదకుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మంత్రికి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. వివరాల్లోకి వెళితే... దుబార్ పట్టణంలోని జ్ఞానేశ్వర మిశ్రా( సేతు) వంతెన వద్ద ఈరోజు యూపీ మంత్రి ఆనంద స్వరూప్ శుక్లా ఆకస్మిక తనిఖీలు చేశారు. 


అదే సమయంలో వంతెన వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనాలను తనిఖీ చేస్తూ నిబంధనలు పాటించని చోదకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కళ్ల ముందే జరుగుతున్న ఆ సంఘటనతో ఆశ్చర్యపోయిన మంత్రి వారిద్దరినీ పట్టుకుని సస్పెండ్ చేశారు. ఇలా వసూళ్లకు పాల్పడుతున్న వారు మరో 11 మంది ఉన్నారని తెలియడంతో వారిని కూడా సస్పెండ్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.

Sat, Dec 14, 2019, 01:09 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View