కాంగ్రెస్ 'భారత్ బచావో' ర్యాలీకి వేలాదిగా తరలివస్తోన్న ప్రజలు.. రామ్‌లీలా మైదానం చేరుకున్న తెలంగాణ నేతలు.. ఫొటోలు ఇవిగో!
Advertisement
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 'భారత్ బచావో' ర్యాలీకి వేలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. ఢిల్లీలోని రామ్‌లీలా గ్రౌండ్స్‌ వేదికగా ఈ ర్యాలీ జరుగుతోంది.
    ఆ మైదానానికి  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు.
     కాంగ్రెస్ అగ్రనేతలందరూ ఈ ర్యాలీలో పాల్గొని ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ ర్యాలీ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.  

ఛలో ఢిల్లీ అంటూ కదలివస్తోన్న కాంగ్రెస్ కార్యకర్తలు..
   

రామ్ లీలా మైదానం చేరుకున్న జానారెడ్డి, రేవంత్ రెడ్డి తదితరులు..    
    
  సోనియా, రాహుల్, ప్రియాంక భారీ కటౌట్లు..


ర్యాలీలో కళాకారుల సందడి..
     
Sat, Dec 14, 2019, 12:57 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View