ఆ వదంతులు నమ్మొద్దు.. నేనే చెబుతాను: హీరోయిన్ కాజల్
Advertisement
సినీ తారలపై ‘పెళ్లి’ వదంతులు రావడం, వాటిని వారు ఖండిస్తుండడం పరిపాటే. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన అందాల చందమామ సినీ నటి కాజల్ అగర్వాల్ పైనా అవే తరహా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ రోజు విజయవాడలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమెను ఈ విషయమై విలేకరులు ప్రశ్నించగా అసలు విషయం చెప్పేసింది.

అవన్నీ వదంతులనీ, అవి అబద్ధాలే అని కొట్టిపారేసింది. వీటిని నమ్మొద్దని, తన పెళ్లి గురించి తానే తెలియజేస్తానని చెప్పింది. ఈ సందర్భంగా పలు భాషల్లో తాను నటిస్తున్న చిత్రాల గురించి చెప్పింది. ఏదైనా తెలుగు సినిమాలో నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు కాజల్ స్పందిస్తూ, కథలు వింటున్నానని, నచ్చితే ఓకే చేస్తానని తెలిపింది.
Fri, Dec 13, 2019, 05:04 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View