ఎన్టీఆర్ తో నటించాలని ఉందని చెప్పిన వెంకటేశ్
Advertisement
వెంకటేశ్ పుట్టినరోజు రేపు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రేపు 'వెంకీమామ' సినిమాను విడుదల చేస్తున్నారు. వెంకటేశ్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి వెంకటేశ్ ప్రస్తావించారు.

"ఈ ఏడాది వరుణ్ తేజ్ తో కలిసి 'ఎఫ్ 2' .. నాగచైతన్య తో కలిసి 'వెంకీమామ' చేసే అవకాశం వచ్చింది. మిగతా యువ హీరోలతోను కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయాలనుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయాలనుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ స్టైల్ ను .. డాన్సింగ్ స్టైల్ ను నేను బాగా ఇష్టపడతాను. మంచి కథ కుదిరితే ఆయనతో కలిసి నటించాలనుంది. 'వెంకీమామ' తరువాత ప్రాజెక్టుగా 'అసురన్' రీమేక్ ఉంటుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుంది" అని ఆయన చెప్పుకొచ్చారు.
Thu, Dec 12, 2019, 06:32 PM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View