'అల వైకుంఠపురములో' టీజర్ తో మహేశ్ రికార్డును బీట్ చేసిన బన్నీ
Advertisement
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాను, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్, సినిమాపై ఆసక్తిని పెంచేదిలా వుంది.

యూ ట్యూబ్ లో ఈ టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. టీజర్ ను విడుదల చేసిన 7 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. అత్యంత వేగంగా ఈ స్థాయి వ్యూస్ ను సాధించిన టీజర్ గా నిలిచింది. ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు' నుంచి టీజర్ ను వదలగా, 9 నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్ మార్కును అందుకుంది. అంతకంటే వేగంగా 1 మిలియన్ వ్యూస్ ను రాబట్టినదిగా 'అల వైకుంఠపురములో' టీజర్ కొత్త రికార్డును నమోదు చేసింది.
Wed, Dec 11, 2019, 06:24 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View