పవన్ తో ఫొటో దిగితే చాలనుకున్నాను .. కానీ సినిమానే తీశాను: దర్శకుడు బాబీ
Advertisement
దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) నుంచి 'వెంకీమామ' సినిమా వస్తోంది. ఈ నెల 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో బాబీ బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "గతంలో నేను తెరకెక్కించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా పరాజయం పాలైంది. ఆ ఫలితం నా కెరియర్ పై తీవ్రమైన ప్రభావం చూపిందనే మాటలను నేను ఇప్పటికీ వింటూనే వున్నాను.

కానీ ఆ సినిమా పరాజయం నాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆ విషయాన్ని గురించి నేను పెద్దగా బాధపడలేదు కూడా. పవన్ తో ఒక ఫొటో దిగితే చాలనుకున్నాను .. కానీ సినిమానే తీశాను .. అంతకన్నా ఏం కావాలి? పవన్ తో నేను చేసిన ప్రయాణం ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ సినిమా నాకు విజయాన్ని ఇవ్వలేకపోవచ్చు .. కానీ అందమైన జ్ఞాపకాలను ఇచ్చింది .. అందుకు ఆనందంగా వుంది" అని చెప్పుకొచ్చాడు.
Wed, Dec 11, 2019, 12:47 PM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View