'పింక్' తెలుగు రీమేక్ గురించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్
Advertisement
హిందీలో ఆ మధ్య వచ్చిన 'పింక్' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్యనే తమిళంలో అజిత్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను 'దిల్' రాజు సొంతం చేసుకున్నారు.

పవన్ కల్యాణ్ హీరోగా ఆయన ఈ సినిమాను నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే పవన్ ఈ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదనే వార్తలు కూడా ఇటీవల షికారు చేశాయి. సంక్రాంతికి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా 'దిల్' రాజు ఏర్పాట్లు చేస్తుండటంతో, పవన్ ఈ సినిమా చేస్తున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో మళ్లీ ఊపందుకుంది. మొదటి షెడ్యూల్లో పవన్ పాల్గొనడనీ, ఆయన కాంబినేషన్ లేని సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తారని అంటున్నారు. పూర్తివివరాలు త్వరలో తెలియనున్నాయి.
Wed, Dec 11, 2019, 12:24 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View