ఢిల్లీ గాలి పీల్చి సగం చచ్చాం... ఇంకా ఉరిశిక్ష ఎందుకు?: పిటిషన్ లో 'నిర్భయ' దోషి నిందితుడి అతి తెలివి!
Advertisement
ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు రగిల్చింది. నిర్భయ హత్య కేసు దోషుల్లో మైనర్ బాలుడికి మినహా మిగతా అందరికీ కోర్టు ఉరిశిక్ష విధించింది. వారిలో ఒకరు జైల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోగా, మిగతా నలుగురికి త్వరలో ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఈ నలుగురిలో ఒకడైన అక్షయ్ సింగ్ తనకు ఉరి విధించడంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. అందులో అతడు పేర్కొన్న కారణాలు విడ్డూరంగా ఉన్నాయి.

ఢిల్లీలోని వాయు కాలుష్యం, జల కాలుష్యం కారణంగా తమ ఆయుష్షు సగం క్షీణించిందని, ఇంకా తమకు ఉరిశిక్ష ఎందుకని పిటిషన్ లో పేర్కొన్నాడు. కాలుష్యం కారణంగా ఢిల్లీ గ్యాస్ చాంబర్ ను తలపిస్తోందని, నీళ్లు సైతం విషపూరితంగా మారిపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఆయుర్దాయం తగ్గిపోతుంటే ప్రత్యేకంగా మరణశిక్ష అవసరమా? అంటూ పైత్యం ప్రదర్శించాడు.
Tue, Dec 10, 2019, 07:32 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View