కుక్క తోక అంటూ చేతులు జోడించి తనకు దండం పెట్టిన సీఎం జగన్ కు చంద్రబాబు కౌంటర్
Advertisement
ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకున్నాయి. కుక్క తోక వంకర అనే సామెతకు ఎవరైనా ఉదాహరణ ఉన్నారంటే అది చంద్రబాబునాయుడుగారేనంటూ సీఎం జగన్ రెండు చేతులు జోడించి దండం పెట్టారు. దీనికి చంద్రబాబు ఘాటుగా బదులిచ్చారు. ఎవరిది కుక్క తోక వంకరో త్వరలోనే తెలుస్తుందని అన్నారు.

"కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదాలనుకుని ప్రజలు మిమ్మల్ని నమ్ముకుని మీకు ఓటేశారు, ఇవాళ వాళ్లు మధ్యలోనే మునిగిపోయామని బాధపడే పరిస్థితి వచ్చింది. మీరేం తొందరపడొద్దు, ముందుంది మొసళ్ల పండుగ. మీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, చేష్టలు మాత్రం గడప కూడా దాటడంలేదు. అప్పుడే అయిపోలేదు, ఏడు నెలల సంబరమే ఇది. ముందు ముందు చాలా ఉంది. మీ కథలన్నీ ప్రజలు చూడాల్సి ఉంది" అంటూ చురకలంటించారు.
 
అంతేకాకుండా, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా దీటుగా బదులిచ్చారు. "ఈ ఆర్థికమంత్రి తాను ఏంచెప్పినా అందరూ నమ్మేస్తారని, ప్రజలంతా చెవులో పూలుపెట్టుకున్నారని అనుకుంటున్నారు. ఆర్థికమంత్రి గారూ చివరికి అందరూ కలిసి మీ చెవిలో పూలు పెట్టే రోజొస్తుంది.. జాగ్రత్తగా ఉండండి!" అంటూ నవ్వుతూనే హెచ్చరించారు.
Tue, Dec 10, 2019, 06:16 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View