వివేకా హత్య కేసు: మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి నాలుగవసారి సిట్ నోటీసుల జారీ
Advertisement
మాజీ మంత్రి వై.యస్. వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో అనుమానితులకు నోటీసులు జారీ చేస్తూ వారిని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డికి సైతం విచారణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే మూడుసార్లు సిట్ నోటీసులు జారీ చేసింది. అయినా ఆయన స్పందించకపోవడంతో మంగళవారం నాలుగవసారి నోటీసును జారీ చేశారు.

ఈ నోటీసులో బుధవారం జరిగే విచారణకు తప్పని సరిగా రావాలని, లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. సిట్ దర్యాప్తు వేగవంతం అయినప్పటి నుంచీ ఆదినారాయణరెడ్డి అందుబాటులో లేకుండాపోయారు. ఆయన స్వగ్రామం దేవగుడిలో సైతం జాడలేదు. ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించని ఆయన రేపటి విచారణకు హాజరు అవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
Tue, Dec 10, 2019, 05:55 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View